
క్రీడలు

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం విమానం తిరిగి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. విజయవాడలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు.
విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం ఎప్పుడు పరిష్కారమవుతుందో, విమానం ఎప్పుడు బయలుదేరుతుందోనని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!