

అమరావతిలో ఏపీ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తాజా వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులపై విచారణ పూర్తయినట్లు తెలిపింది. అలాగే 3.71 కోట్ల మంది ఓటర్ల ఫొటోలను పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు పరిశీలించగా, 3.70 కోట్ల మంది ఓటర్ల ఫొటోల నాణ్యతకు ఆమోదం లభించినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం పోలింగ్ కేంద్ర స్థాయి అధికారుల వద్ద 40,927 ఫొటోల నాణ్యత పరిశీలనలు, ఓటర్ల నమోదు అధికారుల వద్ద 4.52 లక్షల ఫొటోల నాణ్యత పరిశీలనలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటరు నమోదు కోసం సమర్పించిన దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉండగా, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వీటి సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన పరిశీలన, అభ్యర్థనలు, అభ్యంతరాల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!