
రాజకీయాలు

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్‌నగర్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులు చేరుకోవడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఐ నాగరాజును సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు మద్దతుదారులు పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా మద్దతుదారులు పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, తమకు రక్షణ కల్పించేది పోలీసులేనని పేర్కొన్నారు. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని నాగరాజును సిట్ కార్యాలయానికి తరలించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!