
జనరల్

టెట్రా ప్యాకెట్లు, సాచెట్లలో వోడ్కా అమ్మకాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. గుర్తించలేని విధంగా మద్యం విక్రయించడం వినియోగదారులను తప్పుదారి పట్టించడమే కాకుండా మైనర్లను మద్యం వైపు ప్రోత్సహించే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కమ్యూనిటీ అగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. టెట్రా ప్యాకింగ్‌లో పండ్ల రసాల్లా కనిపించేలా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నియంత్రణ విధానం రూపొందించాలని కోర్టును కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!