8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలం దేవాలయంలో కఠిన నిబంధనలు

Writer: Venkatesh 11:50 AM, 20 డిసెంబర్, 2025
శ్రీశైలం దేవాలయంలో కఠిన నిబంధనలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం లో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, అలాగే సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం పై దేవస్థానం కఠిన ఆంక్షలు విధించింది. ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారి పై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రార్థనలు నిర్వహించడం, బోధనలు ఇవ్వడం, ప్రచార కార్యక్రమాలు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. అలాగే అన్యమతాలకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలు పంచడం లేదా అలాంటి కార్యకలాపాలు నిర్వహించడం కూడా నేరమేనని స్పష్టం చేశారు.

దేవస్థానం అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం, వ్యక్తిగత రీల్స్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనుమతిలేదని ఈవో పేర్కొన్నారు. అంతేకాదు, క్షేత్ర పరిధిలో ధూమపానం, మద్యపానం, జూదం ఆడటం, మాంసాహారాలు సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కూడా చట్టవిరుద్ధమేనని హెచ్చరించారు.

దేవాదాయ ధర్మాదాయ నిబంధనలను ఉల్లంఘించి, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలను గౌరవించి పాటించి, దేవస్థానం అధికారులకు సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలో ఓ యువతి రీల్స్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆలయ నిబంధనలు ఉల్లంఘించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ పలువురు నెటిజన్లు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన యువతి, తాను సాంప్రదాయంగా చీర కట్టుకుని మాత్రమే రీల్స్ చేశానని, ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయలేదని వివరణ ఇచ్చింది. తప్పు జరిగితే క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఈవో తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్యటనకు రాహుల్‌

అమెరికా పర్యటనకు రాహుల్‌

పోలండ్‌లో కాల్పుల కలకలం..

పోలండ్‌లో కాల్పుల కలకలం..

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

ట్యాగ్లు
శ్రీశైలంమల్లికార్జున స్వామిభ్రమరాంబదేవిదేవస్థానంఆలయ నిబంధనలురీల్స్‌ నిషేధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు
రాజకీయాలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

అమెరికా పర్యటనకు రాహుల్‌
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్‌

పోలండ్‌లో కాల్పుల కలకలం..
జనరల్

పోలండ్‌లో కాల్పుల కలకలం..

కీరవాణి ఇంట శుభకార్యం
సినిమాలు

కీరవాణి ఇంట శుభకార్యం

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!
షోస్

బిగ్‌బాస్ 10: వర్షిణి, దేబ్జానీకి నాగార్జున క్లాస్.. నరేష్‌కు శిక్ష!

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల
సినిమాలు

వృషకర్మ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్
రాజకీయాలు

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!