
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఒప్పందాల త్వరితగతిన పూర్తి, పెండింగ్ నిధుల విడుదల వేగవంతం చేయడం, డిజిటల్ భారత్ నిధికి ఆస్తుల బదిలీపై స్పష్టమైన విధానం రూపొందించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రింగ్ నెట్‌వర్క్ ద్వారా నిరంతర ఇంటర్నెట్ సేవలు అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మొదటి దశలో నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు కనెక్టివిటీ కల్పించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!