

స్టార్‌బక్స్ అమెరికా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి కార్పొరేట్ టెక్నాలజీ హబ్‌కు చెన్నైను ఎంపిక చేసింది. ఈ కొత్త కేంద్రం కంపెనీ గ్లోబల్ కార్యకలాపాలకు సాంకేతిక మద్దతు అందించడంతో పాటు అమెరికాలోని సియాటిల్, నాష్‌విల్లే సహా ఇతర ప్రాంతాల్లోని టెక్నాలజీ, బిజినెస్ టీమ్‌లతో కలిసి పనిచేయనుంది. చెన్నైలో ఉన్న విస్తృత టెక్ టాలెంట్, ఉద్యోగుల నిలుపుదల సామర్థ్యం, ఇంజినీరింగ్ ఎకోసిస్టమ్, మౌలిక వసతులు, విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ఈ నగరాన్ని ఎంపిక చేసినట్లు స్టార్‌బక్స్ తెలిపింది.
ప్రస్తుతం ఈ హబ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. రానున్న ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థానిక నియామకాలు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంది. నియామకాలు దశలవారీగా కొనసాగనున్నాయి. ఈ టెక్నాలజీ హబ్ స్టార్‌బక్స్ గ్లోబల్ టెక్నాలజీ నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేయనుంది. ఇది భారత్‌లోని రిటైల్ కార్యకలాపాలను నిర్వహించే Tata Starbucks జాయింట్ వెంచర్‌కు వేరుగా ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!