
క్రీడలు

సంజయ్ ఘోడావత్ గ్రూప్‌కు చెందిన స్టార్ ఎయిర్ హైదరాబాద్, ఝర్సుగూడ, భువనేశ్వర్ నగరాలను కలుపుతూ విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ నుంచి ఒడిశాలోని ఝర్సుగూడ, భువనేశ్వర్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.
స్టార్ ఎయిర్ సీఈఓ సిమ్రాన్ సింగ్ ఈ మార్గంలో వారానికి 6 విమాన సర్వీసులు నడుపుతామని తెలిపారు. ఎంబ్రాయెర్ E175 విమానాల్లో ఎకానమీ, బిజినెస్ తరగతి సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!