

సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు 300కు పైగా తాత్కాలిక మార్పిడి గదులు ఏర్పాటు చేశారు. నదిలో భద్రతా చర్యల కోసం తాళ్లతో హద్దులు నిర్ణయించారు. వచ్చే నెల 1 వరకు ప్రతిరోజు సాయంత్రం హారతి నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రాణహిత, గోదావరి నదులతో పాటు అంతర్వాహిణిగా సరస్వతి నది ప్రవహించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ తరువాత సరస్వతి నది ఉన్న ప్రదేశంగా కాళేశ్వరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలను ఈ స్థాయిలో నిర్వహించడం విశేషం. ఆది పుష్కరాల్లో చేసిన స్నానం, పితృతర్పణాలు వంటి కార్యక్రమాలకు వచ్చే ఫలితాలు అంత్య పుష్కరాల్లో కూడా లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (1)
Wow