
సినిమాలు

విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ విద్యార్థులు, యువతకు శాంతి, అహింస మార్గాన్నే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొంటూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు తావివ్వకుండా శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత ఉద్యమాలే శాశ్వత పరిష్కారానికి మార్గమని ఆయన అన్నారు.
కొంతమంది కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు సంయమనం పాటించాలని సోనం వాంగ్‌చుక్ సూచించారు. అహింస తన జీవిత సిద్ధాంతమని పేర్కొన్న ఆయన, ఉద్యమం లక్ష్యం దారి తప్పకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. యువత శాంతియుత పద్ధతుల్లోనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!