

బీపీఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన మంగళవారం పాట్నాలో ఉద్రిక్తంగా మారింది. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో వాటర్ కెనాన్లు, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో పునైచక్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల ఆదిత్య నిరసనలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మీడియాతో మాట్లాడుతూ బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని, లాఠీచార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
తాను భవిష్యత్తు గురించి ఆలోచించే పౌరుడిగా తన హక్కులను వినియోగించుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. దీంతో అతడు నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అయితే బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగడంతో పోలీసులు వివరణ ఇచ్చారు. బాలుడిని అరెస్ట్ చేయలేదని, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతడి భద్రత కోసమే కొద్దిసేపు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించామని స్పష్టం చేశారు. అనంతరం ఆదిత్యను స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో నిరసనకారులు ‘జెన్ ఆల్ఫా’ అంటూ నినాదాలు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!