

ఏపీలో గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు సిట్ గుర్తించింది. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం పునఃమూల్యాంకనానికి అవకాశం లేదని, కేవలం పునఃలెక్కింపునకు మాత్రమే నిబంధనలు అనుమతిస్తాయని తెలిపింది. విజయవాడలో జరిగిన మాన్యువల్ మూల్యాంకనంపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది.
21 ఓఎంఆర్ మూల్యాంకన స్లిప్పుల్లో చేసిన సవరణలకు పరిశీలకుల సంతకాలు లేవని, కొన్ని సంతకాలు అసలు పరిశీలకుల సంతకాలతో సరిపోలడం లేదని సిట్ గుర్తించింది. 57 మంది పరిశీలకుల జాబితా మూల్యాంకనానికి ముందే లీకైనట్లు నివేదికలో పేర్కొంది. కొన్ని ఓఎంఆర్ స్లిప్పుల్లో ప్రధాన పరిశీలకుల సంతకాలు, చేతిరాతలో మార్పులు కనిపించినట్లు తెలిపింది. రెండు పత్రాల్లో మార్పులు చేసింది ప్రధాన పరిశీలకుడేనని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నిర్ధారించినట్లు సిట్ వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!