
రాజకీయాలు

విజయవాడలో ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల కేసుకు సంబంధించి కె. నాగేశ్వరరెడ్డిని సిట్ అధికారులు నిన్న విచారించారు. పలు కీలక ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఈరోజు కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికు పీఏగా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి ఆస్తులపై కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం ముడుపుల ద్వారా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!