
రాజకీయాలు

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టులో ఆధారాలతో సహా ఛార్జిషీట్ సమర్పించింది. మొత్తం 86 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో సీఐ నాగరాజుతో పాటు ఏడుగురిని నిందితులుగా చేర్చింది. సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, పోలీసుల కస్టడీలో జరిగిన చిత్రహింసల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాయికృష్ణ మృతి విషయం బయటకు రాకుండా ఏడుగురు నిందితులు ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఛార్జిషీట్‌లో సిట్ పేర్కొంది. లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లలో సాయికృష్ణ వివరాలను నమోదు చేయలేదని తెలిపింది. లాకప్‌లో ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా పెయింట్ వేయించడంతో పాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!