
జనరల్

ఎన్నికల సంఘం (ECI) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫేజ్-3 ప్రక్రియను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను దశలవారీగా నిర్వహించనున్నారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఈ ఫేజ్‌లో భాగమయ్యాయి. జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహాలు, సిబ్బందికి శిక్షణ, ప్రింటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఈసీఐ ప్రకటించింది.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను సేకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ జూలై 24లోపు పూర్తి చేయనున్నారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేయగా, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 28లోపు వాటి పరిష్కారం పూర్తిచేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!