

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అల్లుడు, మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏ.కే. ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్‌పై రూ.50 లక్షల మోసం ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన 'మహారాగ్ని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని జూబ్లీహిల్స్‌లోని సన్ లైట్ కార్యాలయంలో మోసిన్ ఖాన్, తబ్రేజ్ తనను నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి మాటలను నమ్మి రూ.50 లక్షలు ఇచ్చానని, కానీ పెట్టుబడుల విషయమై ఎలాంటి పురోగతి లేకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరేందుకు కార్యాలయానికి వెళ్లినట్లు అనీష్ రెడ్డి తెలిపారు. అక్కడ మోసిన్ ఖాన్ బౌన్సర్లతో తనపై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా మోసిన్ ఖాన్, తబ్రేజ్‌లపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!