

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో విచారణకు గడువు పొడిగించాలని ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ ఈ మేరకు వచ్చే నెల 30 వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. విచారణను సమగ్రంగా పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమని ఆయన అభ్యర్థించారు.
ఫిబ్రవరి 20న ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, 45 రోజులలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వరుస సెలవులు, అలాగే విచారణకు సంబంధించి పలువురు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల నిర్ణీత గడువులోగా విచారణ పూర్తిచేయడం కష్టంగా మారిందని కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గడువు పెంచాలని కమిషన్ కోరింది.
నివేదిక సమర్పించేందుకు మరింత సమయం అవసరమని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. ఆయన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గడువు పొడిగింపు విషయంలో త్వరలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!