
జనరల్

అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న ఇస్లామిక్ సెంటర్లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కాల్పులు జరిపిన ఇద్దరు టీనేజీ యువకులు కూడా అనంతరం గాయాలతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక సెక్యూరిటీ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను విద్వేష నేరం కోణంలో విచారిస్తున్నామని శాన్ డియాగో పోలీసు చీఫ్ స్కాట్ వాల్ తెలిపారు. ఒక నిందితుడి తల్లి ముందుగానే కుమారుడు మిస్సింగ్‌లో ఉన్నాడని, ఆయుధాలు తీసుకెళ్లాడని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మసీదు ఆవరణలోని అల్ రషీద్ స్కూల్లో ఉన్న పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను ముస్లిం హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!