
జనరల్

అయోధ్య రామ మందిరంలో గత 40 రోజుల్లో దాదాపు 70 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఒక ఉద్యోగి సీసీ కెమెరాలకు అడ్డుగా నిలబడగా, ఇతరులు విరాళాల పెట్టెల్లోని నగదును దొంగిలించి బాత్‌రూమ్‌లో దాచిన తర్వాత పంచుకున్నట్లు తెలిసింది. బ్యాంకుకు నగదు తరలించే సమయంలో కూడా కొంత సొమ్ము పక్కకు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా భక్తులు సమర్పించిన చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జెలు కూడా చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!