
సినిమాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై కూడా పడింది. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెంచింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు వంటి వ్యాపార రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,315కు చేరింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఈ ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. గత కొన్ని నెలల్లో ఇది మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!