
రాజకీయాలు

తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో సేవను వీక్షించారు.
గరుడసేవలో పెదజీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ వాహన సేవను భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!