
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఈ నెల 26 వరకు తీవ్ర ఎండలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు అతి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
బాపట్లలో సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 7.4 డిగ్రీలు అధికంగా నమోదైంది. దక్షిణ కోస్తాలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అమల్లో ఉన్నాయి. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!