11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

Writer: Nithish 05:55 AM, 11 సెప్టెంబర్, 2026
ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీలో ‘ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత-సవాళ్లు, పరిష్కారాలు’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును గురువారం గవర్నర్‌ ప్రారంభించి ప్రసంగించారు. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్స్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐసీఐ), దిల్లీ ఆధ్వర్యంలో తెలంగాణ సమాచార కమిషన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని గవర్నర్‌ అన్నారు.

ఎన్ని ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లను పరిష్కరించామన్నది విజయానికి కొలమానం కాదని, ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఎంత పెరిగిందన్నదే అసలైన విజయమని శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు. దేశంలోని సమాచార కమిషన్లు తమ ఉత్తమ విధానాలు, విజయవంతమైన ప్రయోగాలు, అనుభవాలను పరస్పరం పంచుకునేలా బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సదస్సులో కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ ఆర్‌.కె. గోయల్‌, ఏఎస్‌సీఐ ఛైర్మన్‌ కె. పద్మనాభయ్య, డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌. రమేశ్‌కుమార్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాచార కమిషన్‌ రూపొందించిన ‘తెలంగాణ ట్రాన్స్‌పరెంట్‌ టైమ్స్‌-సమాచార దర్పణం’ న్యూస్‌లెటర్‌ను గవర్నర్‌ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ జి. చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

ట్యాగ్లు
ఆర్టీఐసమాచార హక్కు చట్టంశివప్రతాప్ శుక్లాతెలంగాణ గవర్నర్తెలంగాణ సమాచార కమిషన్పారదర్శకతజవాబుదారీతనంప్రజాస్వామ్యంఆర్టీఐ సదస్సుసమాచార కమిషన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!