

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమంపై వివాదం కొనసాగుతోంది. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ కార్యక్రమానికి మమ్దానీ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మోహన్ భగవత్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారతీయ అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్న ఈ కార్యక్రమాన్ని అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (ఏహెచ్‌ఈఏడీ) నిర్వహిస్తోంది. మమ్దానీ అభ్యంతరాల నేపథ్యంలో ఈ కార్యక్రమంపై చర్చ మరింత వేడెక్కింది. మరోవైపు, కార్యక్రమం ఉద్దేశం సంభాషణ, పరస్పర గౌరవం, ఐక్యతకు సంబంధించినదని నిర్వాహకులు చెబుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!