

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 10న హూతీలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పార్థివదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అయితే మృతుడి పేరు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇదే దాడిలో మరణించిన మరో భారతీయుడిని హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన మహమ్మద్ యూసఫ్ అలీగా గుర్తించారు. అక్టోబర్ 12న రియాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో 300 మందికిపైగా గాయపడగా.. వారిలో 10 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. తాజాగా మరో భారతీయుడు మృతిచెందడంతో ఈ దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య రెండుకు చేరింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!