
ఓటీటీ

రేవంత్ రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై పాలమూరు ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదని, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు, సంబంధిత అధికారులు ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!