
జనరల్

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ (FEMA) ఉల్లంఘనల నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేసింది. రూ.2,422 కోట్ల విదేశీ నిధుల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన ఈడీ సూచనల మేరకు కంపెనీతో పాటు ఐదుగురు డైరెక్టర్లు మొత్తం రూ.18.67 కోట్ల జరిమానా చెల్లించారు.
విదేశీ పెట్టుబడుల పరిమితులు ఉల్లంఘించడం, నిషేధిత రంగాల్లో పెట్టుబడులు స్వీకరించడం, FII/FDI పరిమితులు దాటడం వంటి అంశాలు దర్యాప్తులో బయటపడ్డాయి. అపోలో హాస్పిటల్స్ రూ.17.77 కోట్లు, డైరెక్టర్లు కలిసి రూ.90 లక్షలు చెల్లించారు. ఈ ఘటన కార్పొరేట్ రంగంలో నియంత్రణలపై చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!