
సినిమాలు

కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతి అంత్య పుష్కరాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు ఈ పవిత్ర మహోత్సవానికి తరలివస్తున్నారు. పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులతో కాళేశ్వరం ఘాట్‌లు సందడిగా మారాయి.
ఈ సందర్భంగా ఓ సాధువు పుష్కర నది నీటిపై తేలుతూ చేతులు జోడించి సూర్య నమస్కారం చేస్తూ జల సాధన చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని ఆసక్తిగా వీక్షించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!