
రాజకీయాలు

సూలూర్‌కు చెందిన 10 ఏళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెస్ట్ జోన్ ఐజీపీ రమ్య భారతి ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు చిన్నారిని ఎలా మోసం చేసి, దారుణానికి పాల్పడ్డాడో వివరిస్తున్న సమయంలో ఆమె నవ్వుతూ, సాధారణంగా కనిపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో పిల్లలపై జరిగే ఘోర నేరాల విషయంలో పోలీస్ అధికారుల సున్నితత్వం, బాధ్యతాయుత వైఖరి పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి దారుణ ఘటనలపై స్పందించే సమయంలో మరింత గంభీరత, బాధిత కుటుంబానికి గౌరవం అవసరమని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!