

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 గంటలకు ఆమె దుర్గగుడికి చేరుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో క్యూలైన్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. దీంతో భక్తులు తగిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ దర్శన ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న సరస్ మేళాలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో కలిసి విందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!