
రాజకీయాలు

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల నిలిపివేతకు సైబర్ దాడి కారణం కాదని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై డేటా భారం అధికం కావడమే కారణమని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. విమానాల రాకపోకలను నియంత్రించే వ్యవస్థ చాలా కాలం నాటి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉండటంతో ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. డేటా ఒత్తిడిని వ్యవస్థ తట్టుకోలేకపోవడంతో విమానాల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
భద్రతా కారణాలతో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, ప్రస్తుతం విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అమెరికా విమానయాన రంగంలో వినియోగిస్తున్న పాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!