
క్రీడలు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 5న సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల దినోత్సవంతో కలిసి రావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని వేడుకల్లో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.
1926లో స్థాపించబడిన ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ద కాలంగా విద్యా, వాణిజ్యం, ఆర్థికశాస్త్రం, మేనేజ్‌మెంట్ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తోంది. తరతరాలుగా విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, దేశ నిర్మాణంలో భాగస్వాములైన నాయకులను తీర్చిదిద్దిన సంస్థగా ప్రధాని మోదీ ఎస్‌ఆర్‌సీసీ ప్రాధాన్యాన్ని కొనియాడారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!