

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత నేపథ్యంలో కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భాజపా సభలో మాట్లాడిన మోదీ.. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక నిల్వలు బలపడతాయని అన్నారు. ఆయన వ్యాఖ్యల ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టైటాన్ షేర్ 6 శాతానికి పైగా పడిపోగా, కల్యాణ్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్ స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి.
మోదీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా జ్యువెలరీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 12న ప్రధానమంత్రి కార్యాలయాన్ని కలవనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ వెల్లడించింది. ప్రపంచంలో బంగారం అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి ఏడాది 700-800 టన్నుల బంగారం దిగుమతి అవుతుండగా, దేశీయ ఉత్పత్తి కేవలం 1-2 టన్నులకే పరిమితమవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత బంగారం దిగుమతుల బిల్లు 72 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, చమురు వినియోగం కూడా తగ్గించాలని మోదీ ప్రజలకు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!