

తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అబద్ధాలు మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఎదుట అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు రెండు రోజుల క్రితం వచ్చిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
తెలంగాణ సమాజానికి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కేంద్రంలో గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన నిధులు, చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రియాజ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!