
క్రీడలు

ఎక్స్ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సాంకేతికత అమెరికా సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా రక్షణ వ్యవస్థ కోర్టులో వెల్లడించినట్లు సమాచారం. సంస్థకు చెందిన భారీ డేటా సెంటర్ల నిర్వహణపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా అమెరికా న్యాయశాఖ ఎక్స్ ఏఐ కు మద్దతు తెలుపుతూ, ఆ సంస్థ ఆవిష్కరణలు జాతీయ భద్రతకు ఉపయోగపడుతున్నాయని వాదించింది.
విచారణ సందర్భంగా పెంటగాన్ ఏఐ అధికారి కామెరూన్ స్టాన్లీ వాంగ్మూలం ఇస్తూ, ప్రాజెక్ట్ మావెన్లో భాగంగా ‘గ్రోక్’ ఏఐని వినియోగిస్తున్నామని తెలిపారు. ఇరాన్ కు సంబంధించిన సైనిక ఆపరేషన్లలో లక్ష్యాల గుర్తింపు, విశ్లేషణ వంటి అంశాల్లో ఈ సాంకేతికత సహాయపడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆధునిక యుద్ధాల్లో కృత్రిమ మేధ వినియోగం, దాని ప్రభావం, భద్రతా పరమైన అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!