
క్రీడలు

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో మాట్లాడుతూ, ఆగస్టు 4న సుమారు 100 మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి మార్చ్ నిర్వహించి ప్రజల డిమాండ్లను అందజేస్తామని తెలిపారు.
వాహనదారులకు సాధారణ పెట్రోల్, ఈ20 ఇంధనంలో ఎంపిక చేసే అవకాశం కల్పించాలని, పెట్రోల్ ధరలను తగ్గించాలని, ఇథనాల్ ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ20 విధానంపై ప్రజల్లో ఉన్న ఆందోళనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!