
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం భారీ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు నిర్వహించనుండగా, జూలై–ఆగస్టు వర్షాకాలంలో వాటిని అడవులు, ఖాళీ భూముల్లో విస్తృతంగా చల్లనున్నారు. విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. “మనం చల్లే ప్రతి విత్తన బంతి భవిష్యత్తుకు ఒక హామీ” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!