
ఓటీటీ

నటుడు అడివి శేష్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు కురిపించారు. ఒక నాయకుడిలో ప్రజలు ముందుగా ఆశించేది సమస్యలపై స్పందించే గుణమని, ఆ లక్షణాన్ని తాను పవన్ కళ్యాణ్‌లో స్పష్టంగా గమనించానని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే వాటిపై స్పందించే తత్వం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమని అడివి శేష్ అన్నారు. ప్రజల కష్టాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, సేవాభావం గొప్ప నాయకుడిగా నిలబెడుతున్నాయని కొనియాడారు. సమస్యల పట్ల అంతటి బాధ్యతతో వ్యవహరించే నాయకులు సమాజానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!