
క్రీడలు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి నేడు ‘జన మహాభియోగ్’ పేరుతో ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తొలుత ‘మాక్ పార్లమెంట్’గా భావించిన ఈ కార్యక్రమానికి తాజాగా ‘జన మహాభియోగ్’గా పేరు మార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరగనుంది.
మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం 7.30 గంటల వరకు కొనసాగనుంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ఇండియా కూటమి తన అభ్యంతరాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!