

గ్రేటర్ పరిధిలో వచ్చే రెండేళ్లలో మూడు వేల విద్యుత్ బస్సులను నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 డిసెంబరు నాటికి గ్రేటర్ ప్రాంతాన్ని పూర్తిగా విద్యుత్ బస్సుల మండలంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆర్టీసీ ప్రణాళికలను వేగవంతం చేసింది. ప్రస్తుతం గ్రేటర్ రోడ్లపై 450 విద్యుత్ బస్సులు నడుస్తుండగా, కేంద్ర పథకం కింద అద్దె ప్రాతిపదికన 1500 బస్సులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరో 1500 బస్సులను సమకూర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం గ్రేటర్ ప్రాంతంలో రోజుకు 25 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందిస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా 18 లక్షల మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 26 డిపోలలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, భవిష్యత్తులో నగర పరిధిలో పూర్తిగా విద్యుత్ బస్సులు మాత్రమే నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!