
రాజకీయాలు

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తొమ్మిది చిరుత కూనలు జన్మించాయి. దీంతో భారత్‌లో చిరుతల సంఖ్య 62కు చేరింది. అక్టోబర్ 5న KJP21 అనే చిరుత ఐదు కూనలకు జన్మనివ్వగా, తాజాగా నవంబర్ 20న బోట్స్‌వానా నుంచి తీసుకొచ్చిన KOMG 3 అనే చిరుత మరో నాలుగు కూనలకు జన్మనిచ్చింది.
ప్రత్యేకంగా, KOMG 3 స్వేచ్ఛా అటవీ వాతావరణంలోనే తన కూనలకు జన్మనివ్వడం విశేషం. భారత్‌లో చిరుతల పునరావాసం, సంతానోత్పత్తి కార్యక్రమానికి ఈ పరిణామం ప్రోత్సాహాన్నిచ్చింది. కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య పెరుగుతుండటం వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమంలో కీలక పరిణామంగా నిలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!