
షోస్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భరత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రావాల్సిన నార్వేకు చెందిన జర్నలిస్ట్ హెల్లే లింగ్ వీసాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. విమానాశ్రయానికి బయలుదేరడానికి కేవలం పది నిమిషాల ముందు కేంద్ర హోం శాఖ నుంచి తనకు ఈ సమాచారం అందిందని ఆమె వెల్లడించారు. దీంతో సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
ప్రధాని నరేంద్ర మోదీపై గతంలో విమర్శలు చేసినందుకే రాజకీయ కారణాలతో తన వీసాను రద్దు చేశారని హెల్లే లింగ్ ఆరోపించారు. ప్రెస్ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు ఆమెను సమ్మిట్‌కు ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!