
జనరల్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కార్యక్రమానికి వచ్చిన అభిమానులకు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ నిధి అగర్వాల్ సందడి చేశారు. ఆమెను చూసేందుకు జహీరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందడిగా సాగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!