
టెక్నాలజీ

రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కీలక చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మూడు సంస్థలకు జరిమానాలు విధించింది. ప్రీ-లాంచ్ పేరుతో రెరా నమోదు లేకుండానే ప్రాజెక్టులకు ప్రకటనలు చేసిన అరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా విధించింది. జనప్రియ టౌన్‌షిప్‌కు కూడా నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో రూ.10 లక్షల ఫైన్ విధించింది.
మరోవైపు, ప్రాజెక్టుకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలను వెల్లడించకుండా దాచిన జీకేహెచ్ ప్రాపర్టీస్‌కు రూ.6.10 లక్షల జరిమానా విధించింది. ఈ చర్యల ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలు తప్పనిసరిగా రెరా నిబంధనలు పాటించాలని, ప్రాజెక్టుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని అధికారులు స్పష్టం చేసినట్లయింది. ఇలాంటి చర్యలు కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటంలో కీలకంగా నిలవనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!