
సినిమాలు

సీవీ ఆనంద్ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంచలనాత్మక ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందని, సమీక్ష అనంతరం సిట్ త్వరలోనే రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ పోలీసింగ్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పోలీసింగ్‌లో కృత్రిమ మేధస్సు వినియోగం పెంచుతామని, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడంపై దృష్టి పెడతామని చెప్పారు. గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ బలగాలను సమర్థంగా వినియోగిస్తామని తెలిపారు. సింగర్ మంగ్లీ చేసిన ఆరోపణలపై ఉన్న మైక్రోఫైనాన్స్ కేసును సమీక్షించి స్పందిస్తానన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!