
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు మూడు లక్షల కొత్త సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి, అక్టోబర్ నుంచి పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి విడతలో వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇతర అర్హత కలిగిన కేటగిరీలకు చెందిన లబ్ధిదారులను తదుపరి విడతల్లో చేర్చే అవకాశం ఉంది. దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!