
బిజినెస్

ఓనం పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేరళ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఓనం వేడుకలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పండుగలో భాగమైన వివిధ కళారూపాలు, ఆచార సంప్రదాయాలు సాంస్కృతిక సామరస్యాన్ని, ఐక్యతను చాటుతాయని అన్నారు.
ప్రకృతికి కృతజ్ఞత తెలిపే స్ఫూర్తితో పాటు సోదరభావం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకునే సందేశాన్ని ఓనం అందిస్తుందని సీఎం తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావన మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!