
బిజినెస్

మంత్రి కొండా సురేఖకు సంబంధించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అధిష్టానం వైఖరి నేపథ్యంలో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కొండా మురళి రాయబారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి హాజరుకావడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!