

టీడీపీ నూతన కేంద్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నూతన అధ్యక్షుడిగా పిల్ గురు రాజాతో పాటు మొత్తం 44 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయడమే నూతన కేంద్ర కమిటీ ప్రధాన లక్ష్యంగా పార్టీ తెలిపింది. వివిధ దేశాల్లోని తెలుగువారిని టీడీపీతో మరింత అనుసంధానం చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చురుకైన పాత్ర పోషించనుంది. టీడీపీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో నూతన కమిటీ కీలకంగా పనిచేయనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!