
జనరల్

యూనియన్ డ్యాన్సర్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రఘు మాస్టర్‌ను ఎన్నుకోవాలని మెజార్టీ డ్యాన్సర్లు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కార్యవర్గం అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని కార్యకలాపాలకు ఇప్పటికే పలువురు డ్యాన్సర్లు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు అంశం చర్చనీయాంశంగా మారింది.
రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, దానికి మద్దతు ఇవ్వాలని ఫెడరేషన్‌ను కోరేందుకు మెజార్టీ డ్యాన్సర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. రఘు మాస్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై త్వరలో డ్యాన్సర్ల మధ్య కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!